trisha-mansoor
Home » సారీ చెప్పిన మన్సూర్‌.. దానికి త్రిష ఏమన్నారంటే?

సారీ చెప్పిన మన్సూర్‌.. దానికి త్రిష ఏమన్నారంటే?

by admin
0 comment

హీరోయిన్ త్రిషపై యాక్టర్ మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖలందరూ మన్సూర్‌ వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ మహిళా కమిషన్‌ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే అతడిపై కేసు కూడా నమోదు అయ్యింది. అయితే త్రిషకు క్షమాపణలు చెప్పనని తొలుత ప్రకటించిన మన్సూర్‌.. ఇప్పుడు తాజాగా త్రిషకు సారీ చెప్పాడు. త్రిషపై తనకు ఎలాంటి చెడుద్దేశం లేదని, సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానన్నాడు. ఆమె పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని మన్సూర్‌ తెలిపాడు. దీనిపై త్రిష ఇండైరెక్ట్‌గా రియాక్ట్‌ అయ్యింది.‘‘తప్పు చేయడం మానవ సహజం. క్షమాపణ అత్యున్నతమైనది’’ అని ట్వీట్‌ చేసింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links