చిరంజీవిపై కేసు వేస్తా- మన్సూర్

హీరోయిన్ త్రిషపై యాక్టర్ మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘గతంలో రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’ అని మన్సూర్‌ అన్నాడు. ఈ వ్యాఖ్యలను మెగాస్టార్‌ చిరంజీవితో సహా ప్రముఖలందరూ ఖండించారు. జాతీయ మహిళా కమిషన్‌ సైతం తీవ్రంగా పరిగణించింది. అయితే త్రిషకు క్షమాపణలు చెప్పనని తొలుత ప్రకటించిన మన్సూర్‌.. ఆ తర్వాత సారీ చెప్పాడు. త్రిష కూడా దీనిపై పాజిటివ్‌గా రియాక్ట్ అయింది. దీంతో ఈ వివాదం సద్దుమణిగిందనకుంటే.. మన్సూర్‌ మరోసారి వివాదానికి తెరలేపాడు. చిరంజీవి, ఖుష్బూ, త్రిషపై కేసు వేస్తానని ప్రకటించాడు. పరువు నష్టం దావా వేస్తానని, తన లాయర్‌ ధనంజయన్‌ ద్వారా కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపాడు. త్వరలోనే నోటీసులు జారీచేస్తానని అన్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం