ఘనంగా విడాకుల వేడుక… అది నాన్నంటే!

గతేడాది తన కుమారైకు ఓ తండ్రి వైభవంగా వివాహం జరిపించాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. తన అల్లుడికి ముందే వివాహమైందని! అంతేగాక అతడు తన కూతుర్ని వేధిస్తున్నాడని తెలుసుకున్నాడు. దీంతో తన బిడ్డకి అండగా నిలిచాడు. మేళతాళాలు, బాణాసంచా మధ్య వేడుకగా తన కూతురిని పుట్టింటికి తీసుకొచ్చాడు. ఈ అరుదైన సంఘటన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది. ఈ సూపర్‌నాన్న పేరు ప్రేమ్‌ గుప్తా. గుప్తా కుమారై సాక్షి.. గతేడాది ఏప్రిల్‌లో సచిన్‌ కుమార్‌ను వివాహం చేసుకుంది. కానీ భర్త నుంచి వేధింపులు ఎక్కువవ్వడంతో వైవాహిక జీవితానికి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. విడాకులు ఇప్పించాలని న్యాయస్థానంలో కోరింది. అయితే ఊరేగింపుగా పుట్టింటికి వస్తున్న సాక్షికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం