హోమోసెక్సవల్ పాత్రలో మమ్ముట్టి- ఆ దేశాల్లో సినిమా బ్యాన్‌

మలయాళం మెగాస్టార్‌ మమ్ముట్టి- సీనియర్‌ హీరోయిన్‌ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘కాథల్‌ ది కోర్‌’. అయితే ఈ వారంలో విడుదల కానున్న ఈ మలయాళ సినిమాని కువైట్, ఖతార్‌ దేశాలు బ్యాన్‌ చేశాయి. దానికి కారణం సినిమా కథనే. జీయో బేబి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హోమో సెక్సవల్‌ను ప్రోత్సహించేలా ఉండటంతో ఆ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సినిమా కథను ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. జోసెఫ్ పాత్రలో నటించిన మమ్ముట్టి.. బ్యాంకులో పని చేసి రిటైర్ అయ్యాక పంచాయితీ ఎన్నికలలో నిలబడాలని నిర్ణయించుకుంటాడు. భార్య క్యారెక్టర్‌ చేసిన జ్యోతిక హఠాత్తుగా కోర్టులో విడాకులకు పిటిషన్ వేస్తుంది. దానికి కారణం.. తన భర్త హోమోసెక్సవల్ అని ఊళ్ళో పెను సంచలనం రేపుతుంది. సరిగ్గా ఎలక్షన్ల టైంలో బయట పెట్టడంతో గ్రామంలో కలకలం రేగుతుంది. ఈ పరిణామాలే ‘కాథల్‌ ది కోర్‌’ సినిమా.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం