సూపర్ స్టార్ మహేష్‌బాబు మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. తన సతీమణి నమ్రతాతో కలిసి 2020లో ప్రారంభించిన ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో .. సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు సాయం చేశారు. అయితే తాజాగా మరో సేవాకార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మహేష్. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించే కార్యక్రమాన్ని స్టార్ చేశాడు. దీనికి ”సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్” అని పేరు పెట్టారు. 40 మందికి పైగా పేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి స్కాలర్‌షిప్ అందించనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ వరకు చదివే పేద విద్యార్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ ‘గుంటూరు కారం’ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
222
previous post