HYDలో LuLu Mall- ప్రారంభించిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సంస్థ తమ మొదటి హైపర్ మార్కెట్ సెంటర్‌, మాల్‌ను ప్రారంభించింది. కూకట్‌పల్లిలోని ఈ మెగా షాపింగ్‌ మాల్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మార్కెట్‌ను లులు గ్రూప్‌ చైర్మన్‌ యూసఫ్‌ అలీ, యూఏఈ కాన్సుల్‌ జనరల్‌ ఆరెఫ్‌ అల్‌ నుయిమి ప్రారంభించారు. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకానిమిక్‌ ఫోరమ్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో లులు గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు మొదటి ప్రాజెక్టుగా రూ.500 కోట్ల పెట్టబడి వెచ్చించింది.

ప్రారంభోత్సవ సభకు హాజరైన కేటీఆర్‌ మాట్లాడారు. “లులు సంస్థకు మరిన్ని అవకాశాలు, మద్దతు అందిస్తాం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన ఆ సంస్థ చైర్మన్‌ యూసఫ్ అలీకి ధన్యవాదాలు” అని కేటీఆర్‌ పేర్కొన్నారు. యూసఫ్‌ అలీ మాట్లాడుతూ.. ”తెలంగాణలో ఇది మా తొలి వెంచర్‌. రాష్ట్రంలో బహుళ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రెండవ ప్రాజెక్టులో భాగంగా మీట్‌, ఫుడ్, ఫిష్‌ ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అంతేగాక ఎగుమతులను సులభతరం చేయడానికి డెస్టినేషన్ షాపింగ్ మాల్, మినీ మాల్స్, వ్యవసాయ సోర్సింగ్ హబ్‌లను ఏర్పాట్లు చేస్తాం. మూడేళ్లలో రూ. 3500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం” అని వెల్లడించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..