Leo – లియోకు షాక్‌.. రిలీజ్‌ చేయొద్దన్న కోర్టు

తమిళ స్టార్ హీరో విజయ్‌ మూవీ ‘లియో’కు షాక్‌ ఎదురైంది. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు లియో తెలుగు వెర్షన్‌ సినిమాను అక్టోబర్‌ 20వ తేదీ వరకు రిలీజ్‌ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘లియో’ టైటిల్‌ టైటిల్‌ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్‌ వేయగా దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. వాదనల అనంతరం ఈనెల 20 వరకు తెలుగులో విడుదలను నిలిపివేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అయితే అక్టోబర్‌ 19న రిలీజ్‌ కానున్న లియో మూవీ ఇప్పటికే టికెట్స్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టించింది. విడుదలకు రెండు రోజుల ముందే ఓవర్సీస్‌లో వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఇక విజయ్‌ -కనగరాజ్‌ కాంబోలో రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కోర్టు తీర్పుతో విజయ్‌ ఫ్యాన్స్‌ అయోమయంలో పడ్డారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం