283
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, ఆమె సోదరుడు అక్కడిక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు దాడికి పాల్పడిన ప్రేమోన్మాదిని బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిందుతుడు శివకుమార్ రామంతపూర్ ప్రాంతానికి చెందినవాడు.