Telangana- బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా

తెలంగాణలో బీజేపీకి షాక్‌ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతోనే పార్టీ మారుతున్నట్టు వెల్లడించారు. అయితే ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం సాగుతోంది. గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉపఎన్నికలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..