INDvsAUS- పాపం రాహుల్.. సిక్సర్ బాది బాధపడ్డాడు

చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
గెలుపులో వికెట్ కీపర్ కేఎల్‌ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లితో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ ఔటైనా ఆఖరి వరకు క్రీజులో నిలిచాడు. సిక్సర్‌ బాది జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే విన్నింగ్‌ షాట్‌ సిక్సర్‌ కొట్టాలని ప్రతి ఆటగాడు భావిస్తాడు. కానీ రాహుల్ మాత్రం సిక్సర్ బాది బాధపడ్డాడు. బహుశా ఇలా బాధపడిన ఆటగాడు రాహుల్‌ మాత్రమే అనుకుంటా.

కేఎల్ రాహుల్ బాధపడటానికి కారణమేంటంటే.. భారత్‌ విజయానికి మరో 5 పరుగులే అవసరమన్న సమయంలో అతడు 91 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అప్పటికీ 41 ఓవర్లు మాత్రమే అయ్యాయి. అతడు ఫోర్, సిక్సర్‌ బాది.. శతకం చేసి లాంఛనంగా ఇన్నింగ్స్‌ ముగించాలనుకున్నాడు. కానీ, కమిన్స్ వేసిన బంతిని రాహుల్‌ ఫోర్‌కు ట్రై చేయగా, అది సిక్సర్‌ అయ్యింది. ఫలితంగా సెంచరీ మిస్ అయ్యింది. మూడంకెల స్కోరును అందుకోలేకపోవడంతో భారత్‌ విజయం సాధించినా రాహుల్‌ కాస్త ఫీల్‌ అయ్యాడు. విజయానందంతో కాకుండా బాధగా కాసేపు కూర్చున్నాడు.


Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం