ముద్దు (Kiss) పెట్టుకుంటే మొటిమలు వస్తాయని కొందరు భావిస్తుంటారు. అది అపోహనా, నిజమా అని ఒకసారి చూద్దాం. వైద్యనిపుణుల ప్రకారం ముద్దుకు, మొటిమలుకు అసలు సంబంధమే ఉండదు. అలా అని ముద్దు వల్ల చర్మానికి మరే ఇబ్బందులు వచ్చే ఆస్కారమే లేదని కూడా చెప్పలేమని అంటున్నారు. సాధారణంగా చిన్నపిల్లలకు చర్మంపై చిన్న చిన్న కురుపులు చూస్తుంటాం. అవి ముద్దుల వల్లే వచ్చే అవకాశం ఉంది.
చర్మంతో సన్నిహిత సంబంధం ఉండటం వల్ల కొన్నిసార్లు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జిడ్డు, మొటిమలు బారిన పడిన చర్మం గల వ్యక్తి ద్వారా బ్యాక్టీరియా, ఆయిల్ బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చర్మ సమస్యలకు కారణమవుతుంటుంది. లాలాజలం వల్ల కూడా కురుపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాక కాస్మోటిక్ ఉత్పత్తులు అయిన లిప్‌బామ్స్, లిప్ ప్రొడక్ట్స్ వల్ల కురుపులతో పాటు దురదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ ఫేస్ వాష్, చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించుకొని వీటిని అధిగమించవచ్చు.