స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఖుదీరామ్ బోస్’. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపు ప్రేరణతో మరుగున పడిపోయిన ఖుదీరామ్ జీవితం గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బయోపిక్ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా విజయ్ జాగర్లమూడి నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాళీ, హిందీ భాషల్లో రూపొందించారు. ఇటీవల గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాను ప్రదర్శించగా మంచి స్పందన లభించింది. అంతేగాక ఈ చిత్రాన్ని పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించారు.
కానీ రూ.కోట్లు ఖర్చు చేసిన ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. దీంతో తీవ్ర ఒత్తిడికిలోనైన విజయ్ జాగర్లముడికి గుండెపోటు వచ్చింది. కాగా, ఈ సినిమాకు డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. రాకేశ్ జాగర్లమూడి టైటిల్ పాత్ర పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా, జాతీయ అవార్డు విజేత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. స్టంట్ డైరెక్టర్‌గా కనల్, సినిమాటోగ్రాఫర్‌గా రూసూల్, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేశ్, రైటర్‌గా బాలాదిత్య వ్యవహరించారు.