Crime: Vizagలో కేరళ యువతి సూసైడ్‌

విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో కేరళ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్‌ జిల్లాకు చెందిన రమేష్‌కృష్ణ (25) అనే యువతి చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కాలేజికి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కనెక్టింగ్ ఫ్లైట్ కోసం విశాఖకు వచ్చారు. డాబాగార్డెన్స్‌ భానువీదిలోని ఓ లాడ్జిలో ఈ నెల 23న మధ్యాహ్నం వచ్చారు. తర్వాత రోజు రాత్రి వరకు కూడా ఆమె గది నుంచి బయటకు రాకపోవడంతో లాడ్జ్‌ సిబ్బంది తలుపు తట్టారు. ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం చేసుకున్నారు.

ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్‌ లెటర్‌ను గుర్తించారు. జీవితంపై విరక్తి కలిగిందని, తన చావుకు ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉంది. అయితే విచారణ చేపట్టిన పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమని నిర్థారణకు వచ్చారు. విశాఖకు రాకముందే ఆమె ప్రియుడిని ఇండోర్‌లో కలిసినట్లు గుర్తించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..