కాబోయే భర్తను పరిచయం చేసిన కార్తిక

అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం గత నెలలోనే అయింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది అప్పుడు చెప్పలేదు. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది కార్తిక. అతడితో దిగిన ఫొటోలు ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘‘నిన్ను కలవడం విధి.. ఇష్టపడటం ఒక మ్యాజిక్‌.. మన జీవన ప్రయాణానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది’’ అని ఆమె రాసుకొచ్చింది. అతడి పేరు రోహిత్ మీనన్. అంతకుమించి అతడికి సంబంధించిన వివరాల్ని కార్తిక బయటపెట్టలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే అభిమానులను సొంతం చేసుకుంది కార్తిక. ఆమె కెరీర్ లో ”రంగం” మాత్రమే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక కూతురు పెళ్లికి సంబంధించి తల్లి రాధ.. ఆల్రెడీ పెళ్లి పిలుపులు మొదలుపెట్టింది. ఈమధ్య హైదరాబాద్ వచ్చి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాఘవేంద్రరావు లాంటి ప్రముఖులకు శుభలేఖలు అందించింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం