పోస్టర్‌తోనే అంచనాలను పెంచేసిన కన్నప్ప

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న సినిమా ‘కన్నప్ప’. విష్ణు బర్త్‌డే సందర్భంగా కన్నప్ప ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఫేస్ రివీల్ చేయకుండా డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో…బాణాన్ని ఎక్కుపెట్టిన యోధుడిగా మంచు విష్ణు పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. ఇక పోస్టర్‌లో ప్రకృతి మహా శివలింగం హైలైట్‌గా నిలిచింది. దీన్ని షేర్‌ చేసిన విష్ణు.. ‘కన్నప్ప’ ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ఒక నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారాడన్నది ఈ సినిమాలో చూపించనున్నట్లు చెప్పాడు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా పోస్టర్‌ను ఆరు భాషల్లో విడుదల చేశారు. విష్ణు ప్రధానపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ శివుడిగా, నయనతార పార్వతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం