Pawan Kalyan- వచ్చే ఎన్నికల్లో Janasena-TDP కలిసి పోటీ

వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ (Janasena-TDP) కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న చంద్రబాబు (Chandra babu)తో పవన్‌ కల్యాన్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ యుద్ధానికి సిద్ధమంటే తామూ సిద్ధమేనని తెలిపారు. గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని, అందులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పార్టీలు కలిసివెళ్తాయని, అయితే ఇది ఇరుపార్టీల భవిష్యత్తు కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసమని తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు, తనకి విధానాల పరంగా భిన్నమైన ఆలోచనలు ఉండటంతో విడిగా పోటీ చేశామని వివరించారు. చంద్రబాబు వ్యక్తిగతాన్ని ఎప్పుడూ విమర్శించలేదన్నారు. అక్రమాలు జరిగితే ఈడీ విచారించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. వివేకా హత్య జరిగితే అన్ని వేళ్లూ ముఖ్యమంత్రి జగన్‌ ఇంటివైపే చూపించాయని, కానీ ఇప్పటివరకు ఒక్కర్ని కూడా అరెస్టు చేయలేదన్నారు. సీఎంకు ఆరు నెలల సమయమే ఉందని, జగన్‌ మద్ధతుదారులు ఆలోచించుకోవాలని, సివిల్ వార్ తప్పదని హెచ్చరించారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం