ఆస్ట్రేలియా కుర్రాడు ఫ్రేజర్ 29 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. విండీస్‌పై డివిలియర్స్ 31 బంతుల్లో శతకం సాధించాడు. కాగా, ఆస్ట్రేలియా డొమెస్టిక్ వన్డే కప్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్న ఫ్రేజర్ టాస్మానియాపై 29 బంతుల్లోనే మూడంకెల స్కోరును అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతడు మరో రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా వన్డే కప్‌లో వేగవంతమైన అర్ధశతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో మాక్సీ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా ఫ్రేజర్ 18 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. మొత్తంగా 38 బంతుల్లో 125 పరుగులు చేశాడు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన టాస్మానియా 50 ఓవర్లలో 435 పరుగులు చేసింది. తర్వాత ఛేదనకు దిగిన సౌత్ ఆసీస్ 398 పరుగులకే ఆలౌటైంది.