Virat Kohli- కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా?

స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా? అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందా? కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. దీనికో కారణం ఉంది. రీసెంట్‌గా ముంబయిలోని ఓ గైనిక్ క్లినిక్ వద్ద వీళ్లిద్దరూ కనిపించారు. దీంతో అనుష్క రెండోసారి గర్భందాల్చినట్టు వరుసగా కథనాలు వస్తున్నాయి. అంతేగాక అనుష్క కొన్ని రోజులుగా కెమెరాకు దూరమైంది. భర్త విరాట్ మ్యాచులకు కూడా ఆమె హాజరుకావడం లేదు. దీనికితోడు గణేశ్ చతుర్ధికి ఆమె పెట్టిన పోస్టు కూడా అనుమానాలకు తావిచ్చేలా ఉంది. దీంతో విరాట్ దంపతులు తమ జీవితంలోకి రెండో బిడ్డను ఆహ్వానించబోతున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ విషయాన్ని విరుష్క జోడీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. విరాట్-అనుష్క 2017లో పెళ్లి చేసుకున్నారు. అనుష్క 2021లో కూతురు వామికాకు జన్మనిచ్చింది. ఇప్పుడీమె మరోసారి గర్భందాల్చినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కోహ్లి ప్రపంచకప్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. 34 ఏళ్ల విరాట్‌కు ఇదే చివరి వన్డే వరల్డ్‌కప్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2027లో జరిగే మెగాటోర్నీ సమయానికి అతడికి 38 ఏళ్లు వస్తాయి. అప్పటికీ అతడి ఫామ్‌, ఫిట్‌నెస్‌ ఎలా ఉంటుందో, అంతేగాక ఆ లోపు రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ మెగాటోర్నీనే విరాట్‌కు చివరిదిగా, టీమిండియా ట్రోఫీని తప్పక సాధించాల్సిందిగా ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం