Gambhir- కపిల్‌దేవ్‌ కిడ్నాప్‌ నిజమేనా? : గంభీర్‌

దిగ్గజ క్రికెటర్‌, భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ కిడ్నాప్‌కు గురయ్యాడని గౌతమ్‌ గంభీర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ”ఎవరికైనా ఈ క్లిప్‌ వచ్చిందా? ఇది రియల్‌ కపిల్‌దేవ్‌ కాదని ఆశిస్తున్నా, అతడు క్షేమంగా ఉంటారని భావిస్తున్నా” అని ట్వీట్‌ చేశాడు. దీంతో అభిమానులు కూడా ఇది అబద్ధమా, నిజమా అని తికమకపడ్డారు. అయితే గంభీర్‌ మరో పోస్ట్‌ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. వరల్డ్‌ కప్‌ ప్రోమోలో భాగంగా ఈ వీడియోను షూట్‌చేశారని తెలిసింది. అక్టోబర్‌ 5 నుంచి భారత్‌ వేదికగా ఆరంభమయ్యే ఈ మెగాటోర్నీ.. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూడొచ్చనే సారాంశంతో వీడియో చిత్రీకరించారు.

1975లో ప్రారంభమైన వన్డే ప్రపంచకప్‌లు ఇప్పటివరకు 12 సార్లు జరిగాయి. 1983లో తొలిసారి టీమిండియా వరల్డ్‌ కప్‌ సాధించింది. 28 ఏళ్ల తర్వాత 2011లో ధోనీ నేతృత్వంలో భారత జట్టు మరోసారి మెగాట్రోఫీని ముద్దాడింది. తర్వాత 2015, 2019లో జరిగిన ప్రపంచకప్‌ సమరంలో భారత్‌ సెమీస్‌కు మాత్రమే చేరింది. ఇక భారత్‌ నాలుగోసారి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 1987లో పాకిస్థాన్‌తో, 1996లో పాక్‌, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్‌, శ్రీలంకతో ఉమ్మడిగా ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఈ సారి ఒంటరిగా మెగాటోర్నీ నిర్వహణకు బాధ్యతలు తీసుకుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం