IREvIND: ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణం

తొలి టీ20లో ఆటకు అడ్డువచ్చిన వరుణుడు ఆఖరి మ్యాచ్‌లో ఒక్కబంతి కూడా పడనివ్వలేదు. వర్షం కారణంగా భారత్-ఐర్లాండ్‌ మూడో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో మూడు టీ20ల ద్వైపాక్షిక సిరీస్‌ను భారత్‌ 2-0తో కైవసం చేసుకుంది. ఆసియా కప్‌, ప్రపంచకప్‌ సన్నాహకంగా భావించిన ఈ సిరీస్‌కు యువకులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలో జట్టు ఆడింది.

తొలి మ్యాచ్‌ కూడా వర్షం వల్ల ఆట ఆగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 2 పరుగుల తేడాతో నెగ్గింది. రెండో టీ20లో భారత్‌ 33 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. గాయంతో జట్టుకు దూరమై 11 నెలల తర్వాత పునరాగమనం చేసిన బుమ్రాకు మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ దక్కింది. అతడు ఈ సిరీస్‌లో ఎనిమిది ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం