WC ఫైనల్‌- ఐపీఎల్‌యే కొంపముంచింది: అశ్విన్‌

వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా గొప్పగానే పోరాడినా.. ఫైనల్‌లో మాత్రం తడబడి కప్‌ను చేజార్చుకుంది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే ఫైనల్‌లో ఓటమిపై ఐపీఎల్ ఎఫెక్ట్‌ ఉందని సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్ అన్నాడు.అహ్మదాబాద్‌ పిచ్‌ను ఐపీఎల్‌ అనుభవంతోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా అర్థం చేసుకున్నారని చెప్పాడు. ‘‘టాస్‌ గెలిస్తే బ్యాటింగ్‌ తీసుకుంటామని ఫస్ట్ వాళ్లన్నారు. కానీ దానికి భిన్నంగా ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అలా ఎందుకు చేశారని ఆ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌ బెయిలీని ప్రశ్నించా. అందుకు అతడు స్పందిస్తూ.. ఇక్కడ ఎర్ర మట్టి పిచ్‌పై మంచు ప్రభావం ఎక్కువ ఉండదు. నల్ల మట్టి పిచ్‌పై ఉంటుంది. మధ్యాహ్నం స్పిన్‌కు సహకరించే ఈ పిచ్‌పై రాత్రి బ్యాటింగ్‌ చేయడం తేలిక అని చెప్పాడు. ఆస్ట్రేలియా బృందం పిచ్‌పై కచ్చితమైన అహగాహనకు రావడానికి కారణం ఐపీఎల్‌యే’’ అని అశ్విన్‌ వివరించాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం