టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఐఫోన్ 15, 15ప్లస్, 15 ప్రో, 15 ప్రో మాక్స్ వేరియంట్లతో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీబుకింగ్, 22వ తేదీ నుంచి విక్రయం ప్రారంభం కానుంది. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లతో పాటు వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అయితే ఈసారి ఫోన్లలో యాపిల్ కీలక మార్పులు చేసింది. గత సిరీస్‌లలో ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం చేసిన కొన్ని కీలక ఫీచర్లను ఈసారి యాపిల్ బేస్ మోడళ్లకు తీసుకువచ్చింది.
గతేడాది ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ అనే ఫీచర్‌ను 14 ప్రో మోడల్స్‌లో మాత్రమే ఇచ్చింది. టెక్ ప్రియులను ఎంతో ఆకట్టుకున్న ఈ ఫీచర్‌ను ఈసారి 15 సిరీస్‌లో బేస్ మోడల్స్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్లస్ లో కూడా జత చేసింది. 15 సిరీస్‌లో మరో ప్రత్యేకత.. ఛార్జింగ్ కేబుల్. ఇప్పటివరకు తమ ఉత్పత్తులకు లైటెనింగ్ పోర్ట్‌తో ప్రత్యేక ఛార్జింగ్ బ్రిక్, కేబుల్‌ను ఇచ్చిన యాపిల్ ఈ సారి యూఎస్‌బీ- సి పోర్ట్‌ను ఇచ్చింది.
ఐఫోన్ 15, ఐఫోన్ 15+ మోడల్స్‌లో A16 బయోనిక్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. దీన్ని గతంలో ప్రో మోడల్స్‌కు మాత్రమే పరిమితం చేశారు. అంతేగాక గతంలో ప్రో మోడల్స్‌కు మాత్రమే ఇచ్చిన ఫ్రాస్టెడ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను ఈసారి ఐఫోన్ 15, 15ప్లస్ లోనూ ఇస్తున్నారు. దీంతో ఫింగర్‌ప్రింట్లు సహా ఇతరత్రా మరకల నుంచి కెమెరా లెన్సెస్‌ను దూరంగా ఉంచొచ్చు. అయితే ఈసారి 15 సిరీస్‌లోని ప్రో మోడల్స్‌కు A17 ప్రాసెసర్‌ను రిజర్వ్ చేశారు.
మరో అప్‌డేట్.. కొత్తగా ‘యాక్షన్ బటన్’ ఈ సిరీస్‌లో ఉంది. గతంలో ఫోన్‌కి పక్కభాగంలో ఉండే మ్యూట్ లేదా వైబ్రేట్ బటన్‌ను ఈ సారి ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో యాక్షన్ బటన్‌తో రీప్లేస్ చేశారు. కెమెరాను యాక్టివేట్ చేయడం, ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, వాయిస్ మెమో, నోట్‌ను ప్రారంభించడం, ఫోకస్ మోడ్‌లను మార్చడం, రింగ్, వైబ్రేట్ ఆప్షన్స్‌ను వంటి ఫంక్షన్లను ఈ బటన్ ద్వారా చేయొచ్చు.
కెమెరా విషయంలోనూ ఐఫోన్ 15 బేస్ మోడల్స్‌ను గత సిరీస్‌లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలిపారు. ఇప్పటి వరకు 12MP మెయిన్ సెన్సర్ కెమెరాను ఇస్తూ వచ్చారు. కానీ ఈసారి ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లో 48MP కెమెరాను ఇవ్వడం విశేషం. ఐఫోన్ 15లో 6.1 ఇంచెస్, ఐఫోన్ 15ప్లస్ల్ లో 6.7 ఇంచెస్ OLED సూపర్ రెటీనా డిస్‌ప్లే ఇస్తున్నారు. ఐఫోన్ 15 ప్రోలో 3x ఆప్టికల్ జూమ్, 15ప్రో మ్యాక్స్‌లో 5x టెలిఫోటో లెన్స్‌ను ఇచ్చారు. ఐఫోన్ 15 ప్రోలో మోడల్స్‌ను టైటానియం డిజైన్‌తో తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్ బరువు చాలా వరకు తగ్గుతుంది.
భారత్‌లో 128GB స్టోరేజ్‌తో ఐఫోన్ 15 ధర రూ.79,900, 15 ప్లస్ ధర రూ.89,900, ఐఫోన్ 15 ప్రో ధర రూ.1,34,900.. 256జీబీతో 15 ప్రో మాక్స్ ధర రూ.1,59,900గా నిర్ణయించారు. అలాగే యాపిల్ వాచ్ సిరీస్ 9- రూ.41,900; యాపిల్ వాచ్ అల్ట్రా 2 రూ.89,900 ధరకు నిర్ణయించారు.