iPhone 15- ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

భారత్‌లో ఐఫోన్‌ 15 సిరీస్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు అందుబాలోకి రానున్నాయి. అయితే కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టాప్ మోడల్‌ అయిన “15 ప్రో మాక్స్‌”లో బ్లూ, బ్లాక్‌ టైటానియం వేరియంట్లు అక్టోబర్‌ మూడో వారంలో అందుబాటులో వస్తాయి. ఇక నేచురల్‌, వైట్‌ టైటానియం వేరియంట్ల కోసమైతే నవంబర్‌ రెండోవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ అక్టోబర్‌ మూడోవారం నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ మోడల్‌లో 1టీబీ స్టోరేజ్‌ వైట్‌ టైటానియం కలర్‌ వేరియంట్‌ ఈ నెల 22 నుంచే లభించనుంది. మరోవైపు ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్ల డెలివరీ కూడా ఈ నెల ఆఖర్లో లేదా అక్టోబర్‌ మొదటివారంలో లభించనున్నాయి.

కాగా, ఐఫోన్‌ 15 సిరీస్‌ మోడళ్లు సెప్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో వీటి ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. బేస్‌ మోడళ్లు పింక్‌, యెల్లో, గ్రీన్‌, బ్లూ, బ్లాక్‌ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్‌ వేరియంట్లను అందిస్తున్నారు. ప్రో మోడల్స్‌లో 1టీబీ స్టోరేజ్‌ వరకు అందుబాటులో ఉంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం