INDvsPAK: పాక్‌ మ్యాచ్‌కు KL Rahul దూరం

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సీనియర్ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆసియా కప్‌కు ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేనట్లుగా తెలుస్తోంది. ఆసియాకప్‌లోని భారత్‌ ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ దూరం కానున్నట్లు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ తెలిపాడు. ఆదివారం పాకిస్థాన్‌తో, ఆ తర్వాత నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఆసియాకప్‌ కోసం శ్రీలంకకు పయనమయ్యే భారత జట్టుతో పాటు రాహుల్‌ వెళ్లట్లేదని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఎన్‌సీఏ పర్యవేక్షణలో సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు అతడు ఉంటాడని చెప్పాడు.

”కేఎల్ రాహుల్‌ రెండు మ్యాచ్‌లకు మాత్రమే దూరంగా ఉంటాడు. తర్వాత మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నాం. అతడు, శ్రేయస్‌ అయ్యర్‌ గాయాల నుంచి కోలుకోని తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌ బ్యాటింగ్‌, వికెట్‌ కీపింగ్‌ బాగా చేస్తున్నాడు. కానీ ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. గత 18 నెలల ముందు వరకు 4,5 బ్యాటింగ్‌ స్థానాలకు శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ ఉండేవారు. కానీ ముగ్గురు గాయపడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించరు” అని ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు. కాగా, రేపటి నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. అయితే ద్రవిడ్‌ వ్యాఖ్యలతో.. పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించకముందే కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేశారనే చర్చ మొదలైంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం