INDvsAUS – రికార్డులు బద్దలయ్యాయి

ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అయితే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రాహుల్, కోహ్లి గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. మెగాటోర్నీలో ఆసీస్‌పై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా కోహ్లి-రాహుల్‌ నిలిచారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ శతాబ్ద కాలంలో ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించిన ఏకైక జట్టు భారతే. మరోవైపు మెగాటోర్నీలో చెపాక్‌ పిచ్‌పై ఆసీస్‌కు ఇదే తొలి ఓటమి.

ఆసీస్‌ మ్యాచ్‌లో 85 పరుగులు చేసి శతకం చేజార్చుకున్న కోహ్లి వ్యక్తిగత రికార్డులు సాధించాడు. వన్డేల్లో అత్యధిక హాఫ్‌సెంచరీలు సాధించిన నాన్‌ ఓపెనర్‌ ప్లేయర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక ఐసీసీ నిర్వహించిన లిమిటెడ్‌ ఓవర్‌ టోర్నమెంట్స్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ విరాట్‌ చరిత్ర సృష్టించాడు. మరోవైపు 97 పరుగులు సాధించిన కేఎల్ రాహుల్ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన భారత్ వికెట్‌కీపర్‌గా రికార్డు సాధించాడు. అంతేగాక కంగారూలపై అత్యధిక స్కోరు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ రికార్డు టాప్‌లో శిఖర్‌ ధావన్‌ ఉన్నాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం