INDvsAUS- టీమిండియా చరిత్రలో చెత్త రికార్డు


ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న టీమిండియా ఓ చెత్త రికార్డును నమోదుచేసింది. చరిత్రలో తొలిసారి భారత్‌ టాప్‌-4 బ్యాటర్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ డకౌటయ్యారు. ఓపెనర్లు ఇషాన్‌ కిషాన్‌, రోహిత్‌ శర్మతో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకే కుప్పకూలింది. అయితే లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆసీస్‌ పేసర్లు షాకిచ్చారు. రెండు ఓవర్లలోనే రెండు ఎక్స్‌ట్రా ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో టీమిండియాకు మరో చేదు రికార్డు దక్కింది. 19 ఏళ్ల తర్వాత భారత ఓపెనర్లు డకౌటయ్యారు. గతంలో 2004లో అడిలైడ్‌ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ, బంగర్‌ డకౌటయ్యారు. మళ్లీ ఇప్పుడు ఇషాన్‌, రోహిత్ అలా ఔటయ్యారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం