INDvsAUS- స్పిన్‌లో ఉచ్చులో ఆసీస్‌ విలవిల.. భారత్‌ టార్గెట్‌ 200

భారత్‌ స్పిన్‌ ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. 199 పరుగులకే కుప్పకూలింది. జడేజా మూడు వికెట్లు, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లతో విజృంభించారు. వారికి తోడుగా అశ్విన్, సిరాజ్‌ చెరో వికెట్ తీశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ను బుమ్రా ఆదిలోనే దెబ్బతీశాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్షల్‌ను డకౌట్‌ తీశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ (46)తో కలిసి వార్నర్‌ (41) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్‌దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. అనంతరం భారత బౌలర్లు పుంజుకొని వరుసగా ఆసీస్‌ బ్యాటర్లను బోల్తాకొట్టించారు. ఆఖర్లో స్టార్క్‌ (28) పరుగులు చేయడంతో పోరాడే స్కోరును ఉంచారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో లబుషేన్‌ (27), మాక్స్‌వెల్‌ (15),కమిన్స్‌ (15), గ్రీన్‌ (8) పరుగులు చేశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం