INDvPAK- భారత్‌పై మరోసారి పాక్‌ అక్కసు

ప్రపంచకప్‌ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు వచ్చింది. క్రికెట్‌ అభిమానులు ఘనంగా పాక్‌ జట్టుకు స్వాగతం పలికారు. అయినా పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ అష్రాఫ్‌ భారత్‌పై అక్కసు వెల్లగక్కాడు. పాక్‌ ఆటగాళ్లకు భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నామని, ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారని అన్నాడు. పర్యటనలో శత్రు దేశం ఉన్నా సరే.. నీతికి కట్టుబడి వెళ్తారని వ్యాఖ్యలు చేశాడు. అష్రాఫ్‌ అక్కసు వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. విద్వేషాలు లేకుండా క్రీడా స్ఫూర్తితో పాక్‌ ఆటగాళ్లకు ఇండియాలో ఘన స్వాగతం దక్కినా పాక్‌ వక్రబుద్ధి చూపించడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌-పాకిస్థాన్‌ మధ్య వార్మప్‌ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. వికెట్‌కీపర్‌ రిజ్వాన్‌ (103) శతకం సాధించాడు. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (80), షకీల్ (75) రాణించారు. కివీస్‌ బౌలర్లలో శాంట్నర్‌ రెండు, మ్యాట్ హెన్రీ, నీషమ్‌ చెరో వికెట్‌ తీశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం