ప్చ్…అభిమానులకు నిరాశే ఎదురైంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని భావించినట్లుగానే జరిగింది. ఆసియాకప్‌లో భాగంగా శనివారం జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు శుభారంభం దక్కలేదు. షాహీన్ అఫ్రీద్.. సీనియర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (4)ని బౌల్డ్ చేశాడు. అనంతరం హారిస్ రవూఫ్ శ్రేయస్ అయ్యర్ (14), శుభమన్ గిల్ (10) ఔట్ చేసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో హార్దిక్ పాండ్య (87), ఇషాన్ కిషానన్ (82) గొప్పగా పోరాడారు. అయిదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. అయితే భారత్ భారీస్కోరు దిశగా పయనిస్తుండగా పాక్ బౌలర్లు పుంజుకొని స్కోరును కట్టడిచేశారు. అనంతరం వరుణుడు రాకతో పాకిస్థాన్‌కు బ్యాటింగ్‌కు రాలేదు. అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నేపాల్‌తో భారత్ సోమవారం మ్యాచ్ ఆడనుంది.
మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య హీట్ కలిగించిన మూమెంట్ చోటు చేసుకుంది. సెంచరీ దిశగా వెళ్తున్న ఇషాన్ కిషాన్‌ను హారిస్ రవూఫ్ ఔట్ చేశాడు. భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్ బాబర్ చేతికి చిక్కాడు. అనంతరం హారిస్ అతిగా సంబరాలు చేశాడు. ఇషాన్ వైపు చూస్తూ ‘ఇక వెళ్లు, ఇక వెళ్లు’ అంటూ గట్టిగా అరిచాడు. అయితే హారిస్ వేసిన తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్ పాక్‌కు కౌంటర్ ఇచ్చాడు. మూడు ఫోర్లు కొట్టి హారిస్‌ను గర్వమణిగేలా చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లోవైరల్‌గా మారాయి.