INDvAUS – భారత్‌ ముందు భారీ టార్గెట్‌.. ఆసీస్‌ 352/7

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న ఆఖరి వన్డేలో టీమిండియాకు ఆస్ట్రేలియా భారీ టార్గెట్‌ ఇచ్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆసీస్‌ టాప్‌-4 బ్యాటర్లు చెలరేగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఒక దశలో 400 పరుగుల మార్క్‌ను పర్యాటక జట్టు అందుకునేలా అనిపించింది. కానీ భారత బౌలర్లు ఆఖర్లో పుంజుకుని స్కోరును కట్టడి చేశారు. మిచెల్‌ మార్ష్‌ (96; 84 బంతుల్లో), స్టీవ్‌ స్మిత్ (74; 61 బంతుల్లో), లబుషేన్‌ (72; 58 బంతుల్లో), వార్నర్‌ (56; 34 బంతుల్లో) సత్తాచాటారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు, కుల్‌దీప్‌ యాదవ్‌ రెండు, సిరాజ్‌, ప్రసిధ్‌ చెరో వికెట్ తీశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం