పైరసీకి చెక్‌ పెట్టిన కేంద్రం

సినిమా పైరసీని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైరసీకి వ్యతిరేకంగా CBFC, IBకు చెందిన 12 మంది నోడల్ అధికారులను నియమించింది. పైరసీ కంటెంట్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించేందుకు ఈ అధికారులను ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది. పైరసీ వల్ల సినీపరిశ్రమకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరుగుతోందని, ఏళ్ల తరబడి పడిన శ్రమ వృథా అవుతుందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఇకపై సినిమా పైరసీలకి సంబంధించిన కేసులను నమోదు చేసుకొని 48గంటల్లో చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఇటీవల సినిమాటోగ్రఫీ చట్టం–1952లో సవరణలు చేసి, కొత్త బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో పైరసీని అరకట్టడం అనేది ఓ ప్రధానాంశం. పైరసీకి పాల్పడితే కఠినమైన జరిమానాలు విధించడానికి ఈ బిల్లును ఆమోదించింది. బిల్లులోని నిబంధనల ప్రకారం… కనీసం మూడు నెలల పాటు జైలు శిక్ష, రూ.3లక్షల జరిమానాలు ఉన్నాయి. గరిష్ఠంగా జైలు శిక్షను మూడేళ్ల వరకు పొడిగించవచ్చని, నిర్మాణ వ్యయంలో ఐదు శాతం జరిమానా ఉంటుంది. అలాగే యూట్యూబ్‌, టెలిగ్రామ్‌ ఛానల్స్‌, ఇతర వెబ్‌సైట్స్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంల నుంచి తమ కంటెంట్‌ను తొలగించడానికి కాపీరైట్‌ హోల్డర్స్‌ లేదా ఆ కంటెంట్‌కు సంబంధించి అధికారం పొందిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే ముందు CBFC జారీ చేసిన సర్టిఫికేట్‌ను, యాజమాన్య రుజువును చూపించాలి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం