చైనా వ్యక్తిని రక్షించేందుకు భారత్ డేరింగ్ ఆపరేషన్

చిమ్మ చీకటి, నడి సముద్రం.. అన్ని ప్రతికూల పరిస్థితులే. అయినా చైనా వ్యక్తిని కాపాడటం కోసం ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. గుండెపోటు వచ్చిన చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అసలేం జరిగిందంటే.. చైనా నుంచి అరేబియా సముద్రం మీదుగా యూఏఈ కు వెళ్తున్న నౌకలో చైనీయుడు వీగ్‌యాంగ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో నౌక సిబ్బంది సమీప సముద్రతీర ప్రాంతమైన ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కోఆర్డినేషన్‌ సెంటర్‌కు ఎమర్జెన్సీ మెసేజ్‌ పంపారు.

ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌ వెంటనే స్పందించి బాధితుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ఏఎల్‌హెచ్‌ ఎంకే-3 హెలికాప్టర్‌తో సముద్రంలోకి బయల్దేరింది. సముద్ర తీరానికి దాదాపు 200 కి.మీల దూరంలో ఉన్న నౌకను చేరుకొని ఎయిర్‌లిఫ్ట్‌తో వీగ్‌యాంగ్‌ను బయటకు తీసుకువచ్చింది. హెలికాప్టర్‌లోనే ప్రథమ చికిత్స చేసి అందించి సమీప ఆస్పుత్రికి తరలించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం