ind openers
Home » INDvWI: కుర్రాళ్లు అదరగొట్టారు.. సిరీస్‌ సమం

INDvWI: కుర్రాళ్లు అదరగొట్టారు.. సిరీస్‌ సమం

by admin
0 comment

యువ ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌ (84*; 51 బంతుల్లో), శుభమన్‌ గిల్‌ (77; 47 బంతుల్లో) అదరగొట్టారు. బౌండరీలు బాదడంలో నువ్వానేనా అన్నట్లు పోటీపడటంతో వెస్టిండీస్‌పై టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించిన భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇవాళ రాత్రి 8 గంటలకు సిరీస్‌లో చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. నిర్ణయాత్మక ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన వారిదే సిరీస్‌.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. హెట్‌మెయిర్‌ (61; 39 బంతుల్లో), హొప్‌ (45; 29 బంతుల్లో) రాణించారు. అర్షదీప్‌ (3/38), కుల్‌దీప్‌ (2/26) ధాటికి వెస్టిండీస్‌ ఓ దశలో 57/4తో కష్టాల్లో నిలిచింది. కానీ హొప్‌తో కలిసి హెట్‌మెయిర్‌ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు ధాటిగా ఆడి స్కోరుబోర్డును ముందుకు నడిపించారు.

అనంతరం ఛేదనకు దిగిన భారత్ 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. జైశ్వాల్‌ తొలి బంతి నుంచి దూకుడుగా ఆడాడు. ఫీల్డర్ల మధ్య నుంచి చూడముచ్చటైన షాట్లు ఆడుతూ బౌండరీలు సాధించాడు. మరోవైపు గిల్‌ కూడా అదరగొట్టడంతో 10 ఓవర్లలోనే టీమిండియా 100 పరుగులు చేసింది. తర్వాత ఓవర్‌లోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం సాధించిన మూడో జోడీగా యువ ఓపెనర్లు రికార్డు సృష్టించారు. కానీ భారీ షాట్‌కు యత్నించి గిల్‌ ఔటవ్వడంతో 165 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. అనంతరం తిలక్‌ వర్మ (7*) తో కలిసి జైశ్వాల్ లాంఛనాన్ని పూర్తిచేశాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links