గిల్‌, కోహ్లి, శ్రేయస్ సూపర్‌ ఇన్నింగ్స్‌- భారత్ 357/8

శుభ్‌మన్‌ గిల్‌ (92; 92 బంతుల్లో), విరాట్ కోహ్లి (88; 92 బంతుల్లో) సూపర్‌ ఇన్నింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్‌ (82; 56 బంతుల్లో) పవర్‌ హిట్టింగ్‌ తోడవ్వడంతో.. శ్రీలంక ముందు భారత్‌ 358 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. కెప్టెన్‌ రోహిత్ శర్మ (4) రెండో బంతికే ఔటయ్యాడు. అయితే గిల్‌-కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ తర్వాత బంతికో రన్‌ చొప్పున పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు సాధించారు. ఆ తర్వాత గేర్‌ మార్చిన ఈ జోడీ దూకుడు పెంచింది. అయితే శతకానికి చేరువవుతున్న వీరిద్దరిని మధుశనక పెవిలియన్‌కు చేర్చి దెబ్బతీశాడు. గిల్-కోహ్లి రెండో వికెట్‌కు 189 పరుగులు జోడించారు.

ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (21), శ్రేయస్ అయ్యర్‌ రన్‌రేట్‌ తగ్గకుండా స్కోరుబోర్డును నడిపించారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 47 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు. కానీ లంక బౌలర్లు పుంజుకొని వికెట్లు తీశారు. అయితే మరోఎండ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో మోత మోగించాడు. ఆఖర్లో జడేజా (35; 24 బంతుల్లో) కూడా బ్యాటు ఝుళిపించడంతో భారత్‌ భారీ స్కోరు అందుకుంది. సూర్యకుమార్‌ (12), షమి (2), బుమ్రా (1*) పరుగులు చేశారు. ఆఖరి 10 ఓవర్లలో టీమిండియా 93 పరుగులు చేసింది. లంక బౌలర్లలో మధుశనక అయిదు వికెట్లు, చమీర ఒక వికెట్ తీశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం