వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఏఏ జట్లు తలపడతాయో క్లారిటీ వచ్చేసింది. వాంఖడే వేదికగా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే కివీస్‌తో సెమీస్ అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్ మ్యాచ్‌ల్లో సత్తాచాటిన భారత్ నాకౌట్‌లో మాత్రం తడబడింది. ధోనీ క్రీజులో ఉన్నంతవరకు అభిమానులంతా విజయంపై ధీమాగానే ఉన్నారు. కానీ ధోనీ రనౌటవ్వడంతో స్టేడియంతో పాటు దేశమంతా నిశ్శబ్ధమైంది. ధోనీ కన్నీటితో మైదానాన్ని వీడటం, డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లి, రోహిత్ కంటతడి పెట్టడం అభిమానులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఇప్పుడు ఈ కన్నీటికి ప్రతీకారం తీర్చుకునే టైమ్ వచ్చింది. ప్రస్తుతం భారత జట్టు శత్రు దుర్భేద్యంగా ఉంది. ఏ జట్టు అయినా టీమిండియాను ఢీ కొట్టాలంటే సంకోచిస్తోంది. ఇదే తరహాలో రోహిత్‌సేన చెలరేగి కివీస్‌ను చిత్తుచేయాలని అభిమానులంతా భావిస్తున్నారు.