India vs Bangladesh – ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్‌

పుణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ చేశాడు. గాయంతో హార్దిక్ పాండ్య ఓవర్‌ మధ్యలోనే మైదానాన్ని వీడటంతో బంతి అందుకున్న కోహ్లి.. చివరి మూడు బాల్స్‌ వేశాడు. పవర్‌ప్లేలో తొమ్మిదో ఓవర్‌లో బౌలింగ్ వేసిన విరాట్‌ కేవలం రెండు పరుగులే ఇవ్వడం విశేషం. అయితే వన్డేల్లో అతడు చివరిసారిగా 2017లో శ్రీలంకపై బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే బంతిని అందుకున్నాడు. ఇక వన్డే ప్రపంచకప్‌లో అతడు బౌలింగ్‌ చేయడం ఇది నాలుగోసారి. 2011 క్వార్టర్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఒక ఓవర్‌ బౌలింగ్‌ వేసి 6 పరుగులు ఇచ్చాడు. అదే మెగాటోర్నీలో శ్రీలంకతో జరిగిన ఫైనల్లోనూ ఒకే ఓవర్‌ బౌలింగ్‌ చేసి 6 రన్స్‌ ఇచ్చాడు. ఇక 2015 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఒకే ఓవర్‌ వేసి 7 పరుగులు ఇచ్చాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం