INDvsAFG భారత్ టార్గెట్ 273.. బుమ్రాకు 4 వికెట్లు

దిల్లీ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌కు అఫ్గానిస్థాన్‌ 273 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్‌ బలమైన టీమిండియాను గొప్పగానే ఎదుర్కొంది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మనుల్లా (21), ఇబ్రహిమ్‌ (22) ఫర్వాలేదనిపించారు. వీరిద్దరు కుదురుకుంటున్న సమయంలో టీమిండియా బౌలర్లు పుంజుకొని 63 పరుగులకే మూడు వికెట్లు తీశారు. కానీ ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన హస్మతుల్లా (80), ఒమర్జాయ్‌ (62) అర్ధశతకాలతో రాణించారు. నాలుగో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఒకానొక దశలో అఫ్గాన్‌ 300కు పైగా పరుగులు సాధిస్తుందనిపించింది. కానీ భారత బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి స్కోరు వేగాన్ని తగ్గించారు. బుమ్రా నాలుగు వికెట్లు, హార్దిక్ రెండు, కుల్‌దీప్, శార్దూల్‌ చెరో ఒక్క వికెట్ తీశారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం