331
ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పుర్, హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్ వచ్చింది. అయితే డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్ వేదిక మారనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదే రోజున జరగనుండటంతో ఈ మ్యాచ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని తెలంగాణ పోలీసులు.. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ బీసీసీఐకీ ఈ విషయాన్ని చేరవేసిందని తెలుస్తోంది. అయితే బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.