Virat Kohli- వివాదంలో ‘విరాట్‌ సెంచరీ’.. తొలిస్థానంపై భారత్‌ గురి

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్‌ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్‌ నెట్‌రన్‌రేట్‌ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాదని పుజారా అన్నాడు. అయితే కోహ్లి సెంచరీ చేయాలని తాను కూడా ఎంతో కోరుకున్నాని తెలిపాడు. మరోవైపు నసుమ్ అహ్మద్‌ వేసిన బాల్‌ను.. అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంపై చర్చ సాగుతోంది. కోహ్లి సెంచరీని దృష్టిలో పెట్టుకొని అంపైర్‌ అలా వ్యవహరించాడా? అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. కోహ్లి వికెట్లవైపుగా డీప్‌గా వెళ్లడం వల్లే.. అంపైర్‌ దాన్ని సరైన బంతిగానే ప్రకటించారని కొందరు మాజీలు సమర్థిస్తున్నారు. మరికొందరు అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.

కాగా, ఆదివారం ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తలడనుంది. ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లు ఓటమినెరుగలేదు. ఆడిన నాలుగింట్లో గెలిచాయి. అయితే పాయింట్స్‌ టేబుల్‌లో టీమిండియా కంటే కివీస్ (+1.923) మెరుగైన నెట్‌రన్‌రేటు ఉండటంతో మొదటిస్థానంలో నిలిచింది. భారత్ (+1.659) రెండో స్థానంలో ఉంది. మరోవైపు మెగాటోర్నీలో మన జట్టుపైనే న్యూజిలాండ్‌కే మంచి రికార్డు ఉంది. 2003లో గంగూలీసేన సాధించిన విజయమే ప్రపంచకప్‌లో కివీస్‌పై ఆఖరి గెలుపు . తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో మన జట్టుకు ఓటమి తప్పలేదు. అయితే రేపటి మ్యాచ్‌లో గెలిచి పట్టికలో టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లాలని భారత్ కసిగా బరిలోకి దిగుతోంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం