రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా- రేణు దేశాయ్‌

నటి రేణు దేశాయ్‌ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. మరో రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అలాగే గతంలో రద్దు అయిన తన నిశ్చితార్థం గురించి మాట్లాడారు. ఆ సమయంలో తన కూతురు ఆద్యకు వయస్సు ఏడేళ్లు అని, తాను పెళ్లి చేసుకుంటే ఆద్యకు సరిగా సమయం ఇవ్వలేనేమోనని క్యాన్సిల్ చేసుకున్నాని తెలిపారు. అయితే ప్రస్తుతం ఆద్య వయస్సు 13 ఏళ్లు అని, ఆమె కాలేజీకి వెళ్లాక పెళ్లి గురించి ఆలోచిస్తానని పేర్కొన్నారు. ఇక తాను రెండో పెళ్లి చేసుకోవడం పిల్లలకు కూడా ఇష్టమేనని చెప్పారు. ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోమని తన కుమారుడు అకీరా ఎప్పుడూ చెబుతుంటాడని తెలిపారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో రీఎంట్రీ ఇస్తుంది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె ‘హేమలత లవణం’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం