Secunderabad- అల్ఫా హోటల్‌ సీజ్‌

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ సమీపంలోని అల్ఫా హోటల్‌ను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో మూసివేశారు. ఈ నెల 15న కొంతమంది హోటల్ ఫుడ్ కారణంగా అస్వస్థతకు గురయ్యామని ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. అంతేగాక హోటల్‌ అపరిశుభ్రతకు సంబంధించిన పలు దృశ్యాలు నెట్టింట్లో ప్రచారం కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

ఆహారపదార్థాల శాంపిల్స్‌ను నాచారంలోని స్టేట్‌ఫుడ్‌ ల్యాబోరేటరీకి పంపించారు. మరోసారి అధికారులు తనిఖీ చేయగా అదే తరహాలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో అధికారులు సీజ్‌ చేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి హోటల్ యాజమాన్యానికి ఫెనాల్టీ విధిస్తామని అధికారులు తెలిపారు. గతంలోనూ అల్ఫా హోటల్‌పై ఫిర్యాదులు వచ్చాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..