రాజధాని ప్రజలకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో అందుబాటులో ఉండనుంది. మెట్రోతో పాటు టీఎస్ ఆర్టీసీ సైతం 535 ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇక 35 ఏళ్ల తర్వాత గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకే రోజు వస్తున్నాయి. దీంతో నగరంలో రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల మంది పోలీసులు బందోబస్తు చేయన్నారు. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. మరోవైపు హుస్సేన్‌సాగర్ చుట్టూ 5 చోట్ల 36 క్రేన్లు, పదుల కొద్దీ జేసీబీలు, టిప్పర్లు, వేలాది మంది సిబ్బందితో నిమజ్జన ప్రదేశాలు సిద్ధమయ్యాయి.
382
previous post