మీ Aadhaar Cardతో ఎన్ని SIM Cards ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం డిజిటల్ మోసాలే ఎక్కువవుతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉన్నా కీలక సమాచారం సైబర్‌ నేరాగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది. సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సైబర్‌ నేరాలు, మోసపూరిత ఫోన్‌కాల్స్‌కు సరైన వివరాలు లేకుండా జారీ అవుతున్న సిమ్‌కార్డులే మూలం అవుతున్నాయని ఈ నిర్ణయాన్ని కేంద్ర టెలికాం శాఖ తీసుకుంది.

అయితే ఒక ఆధార్‌ కార్డుతో గరిష్ఠంగా 9 సిమ్‌కార్డులు తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ సిమ్‌కార్డులు తీసుకోవాల్సి వస్తే రీ-వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో మన ఆధార్‌ పేరిట ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకునేలా టెలికాం శాఖ ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. దాంతో ఆధార్ కార్డులో ఎన్ని ఫోన్‌ నంబర్లు అనుసంధానమై ఉన్నాయో సులువుగా తెలుసుకోవచ్చు. అంతేగాక మొబైల్‌ చోరీకి గురైనా, పోగొట్టుకున్నా నంబర్‌ను బ్లాక్‌ చేసుకునేలా కూడా అవకాశం కల్పించింది.

సిమ్‌కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి ఇలా
మొదట tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి. అందులో ‘బ్లాక్‌ యువర్‌ లాస్ట్‌/ స్టోలెన్‌ మొబైల్‌’, ‘నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్‌’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.

రెండో ట్యాబ్‌పై క్లిక్‌ చేస్తే.. వినియోగదారుడి 10 అంకెల మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలని అడుగుతుంది.

ఆ తర్వాత మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేస్తే, ఆ యూజర్‌ పేరిట ఉన్న మొబైల్‌ నంబర్ల జాబితా చూపిస్తుంది.

అందులో ఏదైనా నంబర్‌ మీది కాకపోయినా, ప్రస్తుతం వినియోగించకపోయినా, దానిని బ్లాక్‌ చేసుకునే ఆప్షన్‌ ఉంటుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం