476
ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అధునాతన హోండా డియో 125, హోండా SP 160లను హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఆవిష్కరించింది. ఇవి కొత్త డిజిటల్ స్మార్ట్ కీ ఫీచర్‌తో వస్తున్నాయి. గతంలో 110 సీసీ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. సరికొత్త హోండా డియో 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.85,900గా నిర్ణయించింది. దీనిలో మూడు రకాలైన స్టాండర్డ్, డీలక్స్,హెచ్-స్మార్ట్‌లలో అందించారు. వీటి ధరలు రూ.85,900 నుంచి రూ.93,800 ఎక్స్-షోరూమ్ వరకు ఉన్నాయి. కాగా, భారత్‌లో ఇది హోండా యొక్క మూడవ 125cc స్కూటర్. అంతేగాక దీనికి కొన్ని హైటెక్ డిజిటల్ ఫీచర్లు జోడించారు.