డైరెక్టర్‌ రాఘవేంద్రరావుకు హైకోర్టు నోటీసులు

బంజారాహిల్స్‌ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూకేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణపై సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, మరికొందరికి హైకోర్టు గురువారం నోటీసులు జారీచేసింది. బంజారాహిల్స్‌లో రెండెకరాల భూ కేటాయింపును రద్దు చేయాలని మెదక్‌కు చెందిన బాలకిషన్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాయితీ ధరతో భూమిని కేటాయించగా వారు దాన్ని షరతులకు విరుద్ధంగా బార్‌లు, పబ్‌లు, థియేటర్లు తదితర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 18కి వాయిదా వేసింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం