ముద్దుగుమ్మలు కాదు.. బొద్దుగుమ్మలు

హీరోయిన్ అనగానే ఓ మేజికల్ ఫిజిక్ అలా కళ్లముందు కదలాడుతుంది. అయితే అన్ని సినిమాలకు ఈ సన్నజాతి నడుము సరిపోదు. అవసరమైతే కొన్ని సినిమాల కోసం లావెక్కాల్సి ఉంటుంది. అలా తమ పాత్రల కోసం లావెక్కిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు.

యోగా బ్యూటీ అనుష్క, సైజ్ జీరో కోసం బొద్దుగుమ్మగా మారిపోయింది. ఆ సినిమా కోసం అమాంతం లావెక్కింది అనుష్క. ఆమె హెవీ ఫిజిక్ సినిమాకు ప్లస్ అయింది కూడా. కాకపోతే ఇప్పటికీ ఆమె వెయిట్ ఇష్యూస్ తో సతమతం అవుతోంది. ఆ సినిమా వచ్చి ఇన్నేళ్లయినా, అనుష్క మాత్రం తగ్గలేకపోతోంది.

మహానటి సినిమాలో సావిత్రిలా కనిపించడం కోసం కీర్తిసురేష్ కూడా కాస్త బొద్దుగా మారింది. సినిమాలో ఆమె బూరెబుగ్గలు చూసి, సావిత్రి మళ్లీ పుట్టిందేమో అనుకున్నారంతా. అంతలా మహానటిని అచ్చుగుద్దినట్టు దించేసింది కీర్తిసురేశ్. అప్పటికే కాస్త బొద్దుగా ఉన్న కీర్తి, ఆ సినిమా కోసం మరో 7 కిలోలు బరువు పెరిగింది.

ఆమధ్య ఓ సినిమా కోసం పాయల్ రాజ్ పుత్ కూడా బరువు పెరిగింది. అనుకోని అతిథి అనే సినిమాలో పల్లెటూరి పిల్లగా కనిపించింది పాయల్. ఈ సినిమా కోసం అప్పటివరకు స్లిమ్ గా ఉన్న పాయల్.. 6 కిలోల బరువు పెరిగింది. పల్లెటూరి అమ్మాయిలు లావుగా ఉంటారనేది పాయల్ ఉద్దేశం కాదు, అప్పటికి తనకున్న సైజ్ జీరో ఫిజిక్ తో ఆ పాత్రను పోషిస్తే రక్తికట్టించలేమని భావించి, బరువు పెరిగింది. ఆ తర్వాత మళ్లీ తన పాత స్లిమ్ సైజ్ లోకి మారిపోయింది.

చీపురుపుల్లకు చీరకట్టినట్టు ఎప్పుడూ స్లిమ్ గా ఉంటుంది కంగన. అసలు తన బాడీలోనే లావెక్కే పార్ట్స్ లేవంటూ గతంలో సరదాగా వ్యాఖ్యానించింది ఈ బ్యూటీ. అలాంటి సన్నజాతి కంగనా కూడా లావెక్కింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న తళైవి సినిమా కోసం కంగనా ఏకంగా 10 కిలోల బరువు పెరిగింది.

కృతి సనన్ కూడా లావెక్కింది. మిమి అనే ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలో సరోగసీ తల్లిగా నటించింది కృతి సనన్. ఈ పాత్ర కోసం ఆమె 15 కిలోల బరువు పెరిగింది. ఈ పాత్రను ఓ ఛాలెంజింగ్ గా తీసుకున్న కృతి, చాలా తక్కువ టైమ్ లో ఇలా అమాంతం బరువు పెరిగింది. సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, 4 నెలల్లో బరువు తగ్గింది.

డర్టీ పిక్చర్ కోసం బరువు పెరిగింది విద్యాబాలన్. మామూలుగా ఈ హీరోయిన్ బొద్దుగా ఉంటుంది. అలాంటి హీరోయిన్ కూడా డర్టీపిక్చర్ లో పాత్ర కోసం 12 కిలోలు అదనంగా పెరిగింది. డర్టీపిక్చర్ లో బొద్దుగా కనిపించిన విద్యాబాలన్.. తన పాత్రకు జీవం పోసింది.

లావెక్కిన హీరోయిన్ల జాబితాతో భూమి ఫడ్నేకర్ కూడా ఉంది. ఈ ముద్దుగుమ్మ తన తొలి సినిమా కోసం ఏకంగా 30 కిలోల బరువు పెరిగింది. ఆ పాత్రకు అలా లావుగా కనిపించడం అవసరం. అందుకే ఆమె తన ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెట్టి బరువు పెరిగింది. సినిమాలో ఆమెను తొలిసారి చూసిన బాలీవుడ్ జనాలు.. నిజ జీవితంలో కూడా భూమి అంతే లావుగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు బరువు తగ్గి గ్లామరస్ గా మారింది భూమి.

దాదాపు 10 ఏళ్ల కిందటే ఇలాంటి ప్రయోగం చేసింది ప్రియాంక చోప్రా. ఓ ఆంగ్లో ఇండియన్ సినిమా కోసం కొన్ని కిలోల బరువు పెరిగింది. సెవెన్ ఖూన్ మాఫ్ అనే సినిమాలో జోహెన్నస్ అనే వయసుమళ్లిన పాత్ర పోషించిన ప్రియాంక చోప్రా.. ఆ క్యారెక్టర్ కోసం అప్పటివరకు స్లిమ్ గా కనిపించి, 3 నెలల్లోనే లావెక్కింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం