TARUN: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తరుణ్‌

టాలీవుడ్ లో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో తెలుగులో అనేక సినిమాలు చేశాడు. తరుణ్ కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తరుణ్ బ్యాచిలర్ కావడంతో ఎప్పటికప్పుడు ఆయన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు తెరమీదకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తరుణ్ వివాహం ఫిక్సయింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2 రోజులుగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ తన పెళ్లైపై తరుణ్ క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశాడు తరుణ్. నిజంగా తాను ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా ఆ విషయం చెబుతానని, తన పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు పుట్టుకొస్తున్నాయో అర్థంకావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు తరుణ్.

ప్రస్తుతం తరుణ్ వయసు 42 సంవత్సరాలు. ఇన్నేళ్లయినా అతడు ఇంకా పెళ్లి చేసుకోకపోవడం విచిత్రమే. పైగా అతడిపై డేటింగ్ రూమర్స్ కూడా పెద్దగా రావు. అప్పుడెప్పుడో చాలా ఏళ్ల కిందట హీరోయిన్ ఆర్తి అగర్వాల్ తో, తరుణ్ డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని తరుణ్ తల్లి రోజారమణి ఖండించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆర్తి అగర్వాల్ చనిపోయింది. ఆ తర్వాత ప్రియమణి-తరుణ్ పెళ్లంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని స్వయంగా ప్రియమణి ఖండించింది. అప్పట్నుంచి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్నాడు తరుణ్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో, పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకార్లతో మళ్లీ వార్తల్లోకి వచ్చాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం