kushi
Home » Kushi- ఖుషి సెన్సార్‌ ఎలా ఉందంటే?

Kushi- ఖుషి సెన్సార్‌ ఎలా ఉందంటే?

by admin
0 comment

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందీ సినిమా. సెన్సార్ బృందం ‘ఖుషి’ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో ‘ఖుషి’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

టైటిల్ నుంచి టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా ‘ఖుషి’. లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణకు మంచి హిట్ ట్రాక్ ఉంది. ఈ హిట్ ట్రాక్ కు, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ యాడ్ అవ్వడంతో.. ఖుషీ మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

ఇక రీసెంట్ గా సెన్సార్ నుంచి వచ్చిన టాక్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, ఖుషిని ప్యూర్ లవ్ స్టోరీగా చెబుతున్నారు. అయితే అన్ని లవ్ స్టోరీస్ లో ఉన్నట్టు, ఇందులో కేవలం ప్రేమికులు మాత్రమే కనిపించరట. రెండు కుటుంబాలు, వాళ్ల మధ్య బాంధవ్యాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇక సినిమా నిడివి విషయానికొస్తే.. 165 నిమిషాల నిడివితో ‘ఖుషి’ తెరకెక్కింది. ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాల రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్ కు కనీసం 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే. కథలో ప్రేక్షకులు లీనమైతే కాస్త ఎక్కువ లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేశాయి. అందుకే లెంగ్త్ తో సంబంధం లేకుండా ‘ఖుషి’ ఔట్ పుట్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.

సినిమాకు సంబంధించి ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయింది. ఆడియెన్స్ లో కావాల్సినంత బజ్ క్రియేట్ చేసింది. ఇలా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links