angry
Home » Health Tips: కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలి?

Health Tips: కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలి?

by admin
0 comment

కోపం అన్ని విధాలుగా హానినే కలిగిస్తుంది. ఆవేశంలో చేసే పనులతో కొన్నిసార్లు బంధాలే తెగిపోతుంటాయి. అందుకే కోపాన్ని, ఆవేశాన్ని అణిచివేయాలని అంటుంటారు. ఎప్పుడూ ప్రశాంతతో ఉంటే ఎక్కడైనా మంచి గుర్తింపే దక్కుతుంది. అయితే చాలా మంది తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విఫలమైతుంటారు. తీవ్ర కోపాన్ని చూపి ఆత్మీయులను కోల్పోతుంటారు. కానీ మనం కాస్త ప్రయత్నిస్తే ఆవేశాన్ని సులువుగా కంట్రోల్‌ చేసుకోవచ్చు.

  • కోపం అసలు ఎందుకు వస్తుందా ఒకసారి ఆలోచించాలి. అవసరమైతే పేపర్‌ మీద వాటి కారణాలు రాసుకోవాలి. దానికి తగ్గట్లుగా ఎలా రియాక్ట్ అవ్వాలో ముందుగానే డిసైడ్‌ అవ్వాలి. ఇలా చేస్తే ఆలస్యమైనా కోపం తప్పక కంట్రోల్‌ అవుతుంది.
  • ఆవేశంలో మనకు తెలియకుండానే ఇతరులు హర్ట్ అయ్యేలా మాట్లాడుతుంటాం. దాని వల్ల బంధాలు తెగిపోతుంటాయి కూడా. అందుకే కోపం వచ్చిన సందర్భాల్లో తక్కువగా మాట్లాడానికి ప్రయత్నించాలి. వీలైతే ఆ ప్రదేశం నుంచి కాస్త దూరంగా వెళ్లి ప్రశాంతంగా ఆలోచించడానికి ట్రై చేయాలి.
  • పని ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అవి ఒక దశలో కోపంగా మారుతుంటాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించేందుకు లాంగ్‌ టర్మ్‌ ప్లాన్స్‌ వేసుకోవాలి. రోజూ ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇవి చేయడం వల్ల మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు.
  • కోపం తీవ్రతను తగ్గించుకోవాడానికి చాలా మార్గాలు ఉన్నాయి. శ్వాసపై కాసేపు దృష్టి పెట్టడం, నంబర్స్‌ను కౌంట్ చేయడం, మంచి నీరు తాగడం, సంగీతం వినడం.. చేస్తే కాస్త కంట్రోల్‌లో ఉంటాం. మన కోసం సమయాన్ని కేటాయించుకోవాలి. ఇష్టమైన ప్రదేశాలను చూడటం, పిల్లలతో ఆడుకోవడం, మీమ్స్‌, కార్టూన్స్‌ చూడటం చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఇతరులకు హాని కలిగించేలా కోపం వస్తే వైద్యులని సంప్రదించాలి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links