Hardik Pandya – టీమిండియాకు షాక్‌.. హార్దిక్‌ దూరం

టీమిండియాకు షాక్‌. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య దూరమయ్యాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్‌ గాయపడిన సంగతి తెలిసిందే. లిటన్ దాస్‌ స్ట్రైయిట్ డ్రైవ్‌ను ఆపేందుకు కుడికాలితో ప్రయత్నించిన హార్దిక్‌ పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు. దీంతో చీలమండకు గాయమై నొప్పితో మైదానాన్ని వీడాడు. తర్వాత అతడిని స్కానింగ్‌ కోసం తీసుకెళ్లారు. రిపోర్టుల అనంతరం వైద్యబృందం సూచన మేరకు అతడికి విశ్రాంతినిచ్చారు. అయితే కివీస్‌ మ్యాచ్‌కు మాత్రమే హార్దిక్ దూరమవుతాడని, లక్నో వేదికగా జరిగే ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది.

హార్దిక్‌ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. అతడు మరిన్ని మ్యాచ్‌లకు దూరమైతే జట్టు సమతూకం దెబ్బతినే ప్రమాదముంది. ప్రపంచకప్‌ పట్టికలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా అన్నింట్లోనూ గెలిచింది. అక్టోబర్‌ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో, అక్టోబర్‌ 29న లక్నోలో ఇంగ్లాండ్‌తో, నవంబర్‌ 2న మంబయిలో శ్రీలంకతో, నవంబర్‌ 5న కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో, నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో రోహిత్‌సేన తలపడనుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం